NTR senior song
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవొ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల ఏవేవొ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి ఆఆఅ..ఆఅహహ..ఆహా.. పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా నిను చేరుకోగ నునుమేని తీగ పులకించి పోయెను తొలకరి వలపుల ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె అనురాగ సీమల అంచులు దొరికే ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది